Radhakrishna whatsApp dp edits

 శ్రీకృష్ణుడు అంటే హిందూమతానికి, హిందూధర్మానికి అంతరాత్మ లాంటివాడు. కృష్ణుడు, రాముడు గుర్తురాకుండా హిందూమతం గుర్తుకురాదనే చెప్పవచ్చును. అంతేకాదు నవభారత నిర్మాణానికి మూలపురుషుడుగా శ్రీకృష్ణుడు భారతదేశ చరిత్రకే కధానాయకుడు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడుగా జన్మించాడు. కృష్ణుడి జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి సంతానంగా ఎనిమిదో గర్భంలో జన్మించాడు.

శ్రీకృష్ణుడి జననం

శ్రీకృష్ణుని జనన కాల నిర్ణయం భాగవతం దశమస్కందం మూడవ ఆధ్యాయంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఆ రోజు 'ప్రజాపతి' నక్షత్రం ఉందని తెలుపుతున్నది. ప్రజాపతి నక్షత్రం అంటే రోహిణి నక్షత్రం. విష్ణు పురాణంలో మొదటి ఆశ్వాసం - 5 వ అంశం ( శ్లోకం - 26 ) ఆధారంగా శ్రీ కృష్ణుడు శ్రావణ మాసంలో జన్మించాడనీ, అందులోనూ బహుళ పక్షంలో అష్టమి తిధి జరుగుతుండగా జన్మించడం జరిగిందని ఆధారంగా కనబడుతుంది. 'హరి వంశం' సంస్కృత మూలం తీసి చూసినట్లైతే 52


Tap to download

కృష్ణాష్టమికి ఇతర పేర్లేంటి..?

కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఉయాల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో ఉట్టి కట్టి యువతరం పోటీపడి కొడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని ప్రాంతాల వారిగా పిలుస్తారు. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.

Post a Comment

Previous Post Next Post